ఈనెల 29న ముఖేశ్ గౌడ్ వర్ధంతి.. విక్రమ్ గౌడ్

by Javid Pasha |   ( Updated:2023-07-22 15:53:31.0  )
ఈనెల 29న ముఖేశ్ గౌడ్ వర్ధంతి.. విక్రమ్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత నేత ముఖేష్ గౌడ్ నాలుగో వర్ధంతి ఈ నెల 29న ఉన్నట్లు ఆయన తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విక్రమ్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలో ఉన్న ముఖేష్ గౌడ్ అభిమానులు, బీజేపీ జాతీయ నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీసీ సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులను ఆహ్వానించినట్లు విక్రమ్ గౌడ్ తెలిపారు.

తన తండ్రి ముఖేశ్ గౌడ్ పార్టీ, బేధభావాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. సమస్య ఉందని వెళ్తే పరిష్కారం చూపి పంపించేవారని, అందుకే ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయన్నారు. అందుకే ఆ పార్టీ.. ఈ పార్టీ అనే భేదాలు లేకుండా తన తండ్రి స్నేహితులు, సన్నిహితులుగా మెలిగిన వారితో పాటు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed