- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మల్లారెడ్డి! ఎవరొచ్చినా భయపడేది లేదంటూ మాస్ డైలాగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరు వచ్చినా రాకున్నా.. బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. సగం మంది క్యాడర్ కన్ఫ్యూజన్‌లో ఉండి పార్టీ సమావేశానికి రాలేదని మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ శ్రేణులతో ఇవాళ పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను కార్యకర్తలే గెలిపించారని, కాంగ్రెస్, బీజేపీకి క్యాడర్ లేనే లేదంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా, ఇవాళ్టీ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడిన తీరుపై మళ్లీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మళ్లీ మల్లారెడ్డి ఫుల్ ఫామ్‌లోకి వచ్చారని తెలిపాయి. ఇటీవల మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ రైడ్స్, హాస్టల్ భోజనంలో పురుగులు, అక్రమ కట్టడాల కూల్చివేత, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పుకార్లు లాంటి అనేక విషయాలతో మాజీ మంత్రి మల్లారెడ్డి కాస్తా డల్‌గా కనిపించినట్లు ప్రచారం జరిగింది. చాలా రోజుల తర్వాత ఇవాళ పాత రోజుల మాదిరి మల్లారెడ్డి ఫుల్ జోష్‌లో మాట్లాడి కార్యకర్తలు, నాయకులలో ఫుల్ జోష్ నింపారు.