రాష్ట్రంలో అత్యాచారాలు పెరగడానికి ముఖ్యమంత్రే కారణం.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
రాష్ట్రంలో అత్యాచారాలు పెరగడానికి ముఖ్యమంత్రే కారణం.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సీఎం వ్యవహారం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. పోలీసుల పని పోలీసులను చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. ఒకవైపు శాసనసభ జరుగుతుండగానే.. ఇవాళ మరికొన్ని అత్యాచారాలు జరగడం బాధాకరం అన్నారు. ఇది కాంగ్రెస్ గొప్ప పాలన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎవరికీ ఇంగిత జ్ఞానం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed