- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగునీళ్లు ఇవ్వరు! కనీసం మంచి నీళ్లయినా ఇవ్వండి.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తాగునీరు సమస్యగా మారిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తాగునీటి కోసం పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారని, దీంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తాగునీటి సమస్యపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.
గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారని పేర్కొన్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని, పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్ళయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.