‘తెలంగాణ వద్దంటూ ఉద్యమకారులపై గన్ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి’

by GSrikanth |   ( Updated:2024-04-08 13:10:19.0  )
‘తెలంగాణ వద్దంటూ ఉద్యమకారులపై గన్ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి’
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు గడిచినా హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లయ్య గార్డెన్‌లో యువతతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రం కావొద్దని ఉద్యమకారులపై గన్ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అని అన్నాడా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ఇచ్చినట్లు చెబుకుంటున్నారని విమర్శించారు. అనంతరం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపైనా విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో చెల్లని రూపాయి.. మెదక్‌లో చెల్లుతుందా? అని అడిగారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed