బీఆర్ఎస్ ఎప్పటికీ బలహీన పడదు: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-16 14:57:12.0  )
బీఆర్ఎస్ ఎప్పటికీ బలహీన పడదు: మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై భారీ కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి ఓడినంత మాత్రాన పార్టీ బలహీన పడదని అన్నారు. గొప్పగా చేశామని చెప్పుకుంటున్న రుణమాఫీలో అడ్డగోలుగా కోతలు పెట్టారని విమర్శించారు. ఒక్క విడతలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎవరూ ఆనందంగా లేరని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే సీఎం సహా మంత్రులంతా రైతులు, యువత, మహిళలను మభ్య పెడుతున్నారని తెలిపారు. గందరగోళ పరిస్థితుల మధ్య ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. అసలు సీఎం రేవంత్, మంత్రుల ప్రకటనలకు మధ్య పొంతనే ఉండటం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed