- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తల తెగిపడ్డ.. ఆ పని మాత్రం చేయనని మోడీకి చెప్పా: KCR సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోడీ నాపై ఒత్తిడి తెచ్చారు.. కానీ నా తల తెగిపడ్డ మోటార్లకు మీటర్లు పెట్టనని ప్రధానికి తేల్చి చెప్పానని గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో దేశం బాగుపడలేదని.. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఫైర్ అయ్యారు.
పదేళ్లలో ప్రధాని మోడీ వంద నినాదాలు చెప్పారు.. ఒక్కటి అయిన జరిగిందా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా..? దేశంలో బుల్లెట్ రైళ్లు వచ్చాయా..? గ్యాస్ ధరలు తగ్గాయా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు చేసుకుంటే ఒక్క నవోదయి పాఠశాల అయిన ఇచ్చారా అని నిలదీశారు. దేశమంతటికీ మెడికల్ కాలేజీలు ఇచ్చి.. తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే కూడా ఇవ్వలేదని బీజేపీపై నిప్పులు చెరిగారు.