బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలు

by Ramesh N |
బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం అనేక మంది నేతలు ఎదురు చూశారు. మూడు రోజు సమావేశాలు జరుగుతున్న కేసీఆర్ మాత్రం ఇంకా అసెంబ్లీ రాలేదు. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయిన కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న ఇంకా హాజరు కాలేదు. కాగా, అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించలేక రావడం లేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది. మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed