చాకలి ఐలమ్మకు మాజీ సీఎం కేసీఆర్ నివాళి

by Gantepaka Srikanth |
చాకలి ఐలమ్మకు మాజీ సీఎం కేసీఆర్ నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి(సెప్టెంబర్ 10) సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నది. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించేదిశగా వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed