కేంద్రంపై BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్

by Rajesh |
కేంద్రంపై BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని వినోద్ కుమార్ తెలిపారు. దీని కోసం బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని పోరాటాలు జరిగాయన్నారు. 30 ఏళ్లు గడిచినా.. అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పెట్రో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారని.. సీఎం చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టే.. ఏపీకి ఈ ప్రాజెక్టులు ఇస్తున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed