- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నియోజకవర్గాల్లో ఆయన వల్లే ఓడిపోయాం.. మాజీ MLC హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశంలో పాల్గొ్న్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాట్ కామెంట్స్ చేశారు. స్థానికేతరులకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంతో మూడు స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని.. మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్ష కామెంట్స్ చేశారు. జిల్లాపై సంపూర్ణ అవగాహన, పట్టున్న తమకు ఎన్నికల సమయంలో దూరం పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరం పరాజయం పొందిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదని తరచూ కామెంట్స్ చేశారు. 1.8శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయామని గుర్తుచేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేసి లాభం లేదని చెబుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో లేని పార్టీకి ఓటేస్తే బురదలో వేసినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూడాలి.