19 వీడీఏల ఏర్పాటు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ

by Shiva |
19 వీడీఏల ఏర్పాటు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ తరహాలో 19 అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (వీడీఏ)లను ఏర్పాటు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లా కేంద్రాలతో పాటు సమీపంలోని గ్రామాల్లో రోడ్ల నెట్‌వర్క్ అభివ్రద్ధి, తాగునీటి సరఫరా, ఉపాధి కల్పన, శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఈ ఆథారీటీలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వనపర్తి జిల్లా అభివ్రద్ధిలో భాగంగానే వనపర్తి టౌన్, ఐదు మున్సిపాలిటీలు, 215 గ్రామాలను కలుపుకుని వనపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మున్సిపాలిటీతోపాటు 152 గ్రామాలను కలిపి వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేశారు. సూర్యపేట జిల్లా కేంద్రంగా సూర్యపేట మున్సిపాలిటీతో పాటు ఐదు మున్సిపాలిటీలు, 264 గ్రామాలను కలిపి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, సిద్దిపేట్ జిల్లాలో సిద్దిపేట్ మున్సిపాలిటీతో పాటు 4 మున్సిపాలిటీలు, 286 గ్రామాలతో సిద్దిపేట్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రెండు మున్సిపాలిటీలు, 279 గ్రామాలతో స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేశారు.

వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మున్సిపాలిటీతో పాటు 4 మున్సిపాలిటీలు, 492 గ్రామాలతో వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 147 గ్రామాలతో శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి మున్సిపాలిటీతో పాటు 5 మున్సిపాలిటీలు సంగారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, 5 మున్సిపాలిటీలు, 466 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 380 గ్రామాలతో నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతోపాటు మూడు మున్సిపాలిటీలు, 420 గ్రామాలతో నిర్మల్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, మహబూబబాద్ జిల్లాలో టౌన్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 159 గ్రామాలతోపాటు మహబుబబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో టౌన్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 319 గ్రామాలతో నాగర్ కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, మంచిర్యాల్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 350 గ్రామాలతో మంచిర్యాల్ అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ, మహాబుబ్‌నగర్ జిల్లాలో మున్సిపాలిటీతో పాటు 153 గ్రామాలతో మహాబుబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక గ్రామతో పాటు కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేశారు. కామారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీలో 3 మున్సిపాలిటీలు, 460 గ్రామాలు ఉన్నాయి. కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 199 గ్రామాలతో కాగజ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ, 4 మున్సిపాలిటీలు, 194 గ్రామాలతో జోగులాంబ గద్వాల్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, ఆదిలాబాద్ టౌన్‌తో పాటు ఒక మున్సిపాలిటీ, 107 గ్రామాలతో ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed