- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Floods 2024: వరద బాధితులకు కురుమ సంఘం ఆధ్వర్యంలో విరాళం
దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులకు సాయం చేసేందుకు రాష్ట్ర కురుమ సంఘం ముందుకు వచ్చింది. ఈ మేరకు 10 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. దీంతో వరద బాధితులకు సాయం చేసేందుకు సీఎం సహాయ నిధికి పలువురు విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అకాల వర్షాల వల్ల తెలంగాణలో వరదలతో సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కురుమ సంఘం ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును కురుమ సంఘం తరుపున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎగ్గే మల్లేశంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.