బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ.. నాలుగో రోజు 333 దరఖాస్తులు

by Vinod kumar |   ( Updated:2023-09-07 17:07:39.0  )
బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ.. నాలుగో రోజు 333 దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం బీజేపీలో ఆశావహులు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. నాలుగో రోజు మొత్తం 333 అప్లికేషన్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో భాగంగా ఆశావహుల నుంచి మొత్తం 999 దరఖాస్తులు వచ్చాయి. పరకాల నియోజకవర్గ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జైపాల్ దరఖాస్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ స్థానానికి ఇద్దరు మహిళా నేతలు జూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ అప్లికేషన్ పెట్టుకున్నారు. నారాయణ ఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప దరఖాస్తు చేశారు. కాగా గోషామహల్ స్థానానికి మరో దరఖాస్తు వచ్చింది. గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండు అప్లికేషన్ చేసుకున్నారు.

ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ అసెంబ్లీ టికెట్ కోసం ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు మునుకుంట్ల రాజేష్ రెడ్డి అప్లికేషన్ అందజేశారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కాపల్లి గ్రామానికి చెందిన మునుకుంట్ల రాజేష్ రెడ్డి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి ప్రైవేట్ ఉద్యోగులందరినీ ఏకంచేసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి 2019లో బీజేపీలో చేరారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో శ్రమించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మీడియా విభాగంలో పనిచేశారు. ఇదిలా ఉండగా మంత్రి పువ్వాడ అజయ్‌పై పోటీ చేస్తానని ఓయూ విద్యార్థి నేత డాక్టర్ పుల్లారావు యాదవ్ ఖమ్మం అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు. గరికపాటి మోహన్ రావుతో కలిసి పార్టీలో చేరారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామా యాత్రలో కీలక భూమిక పోశించారు. నిరుద్యోగ మార్చ్‌లోనూ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తనకు టికెట్ కేటాయిస్తే పువ్వాడను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed