- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్లాష్.. ఫ్లాష్: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజ ఫుడ్ ఇండస్ట్రీ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు ఆటోలో ఉపాధి కోసం ఉదయం కంపెనీకి బయలుదేరారు.
అదే సమయంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు చెందిన బస్సు లోపలికి వెళ్తుండగా అటుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ప్రమాద స్థలం నుంచి సుమారు 20 మీటర్ల వరకు ఆటోను బస్సు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దాకోజు నాగలక్ష్మి(28), వరకాంతం వనసూయ(55), చిలువేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష(30)లు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
తీవ్ర గాయాలపాలైన అఖిల, యామిని, కావ్య, డ్రైవర్ కొండ వెంకటేశం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులంతా రేక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కండతడి పెట్టిస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.