రామాయణం స్కిట్ లో కాంట్రవర్సీ.. ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20 లక్షల ఫైన్‌

by Prasad Jukanti |   ( Updated:2024-06-20 07:30:20.0  )
రామాయణం స్కిట్ లో కాంట్రవర్సీ.. ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.1.20 లక్షల ఫైన్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: రామాయణం ఆధారంగా ప్రదర్శించిన ఓ స్కిట్ వివాదాస్పదం కావడంతో ఐఐటీ బాంబే విద్యార్థులకు యాజమాన్యం భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షల చొప్పున ఫైన్ వేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబే లో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో 'రాహోవన్' పేరుతో కొంత మంది విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ అరణ్యవాసం కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. అయితే ఇందులో ఉపయోగించిన భాష, హావభావాలు రామాయణాన్ని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం స్పందించి క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ దర్యాప్తు అనంతరం యాజమాన్యం బాధ్యులైన విద్యార్థులకు జరిమానా విధించింది.

Advertisement

Next Story

Most Viewed