సినిమా షూటింగ్‌లకు బ్రేక్..! రామోజీకీ సినీ ఇండస్ట్రీ నివాళులు

by Ramesh N |
సినిమా షూటింగ్‌లకు బ్రేక్..! రామోజీకీ సినీ ఇండస్ట్రీ నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగు జర్నలిజం లోనే కాకుండా సినిమా రంగంలో కీలక పాత్ర ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటిల్లో ఒకటైన ఫిలిం సిటీని నిర్మించారు. ఇక్కడ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సినిమా షూటింగ్‌లు జరుగుతాయి. దేశంలోని సినీ ఇండస్ట్రీలకు షూటింగ్‌ల కోసం ఇది మంచి స్పాట్. బాహుబలి లాంటి హిట్ చిత్రం సైతం ఇక్కడే షూటింగ్ చేశారు. అయితే, ఆయన మృతిపై సినీ ఇండస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది.

రామోజీరావు మృతి పట్ల సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ సెలవు ప్రకటించారు. కాగా, రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయాన్ని ఉంచారు. ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed