- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవార్డులు బాధ్యతను పెంచుతాయి: సినీ నటి శ్రీజ
దిశ, తెలంగాణ బ్యూరో: అవార్డులు గౌరవాన్ని అందించడమే కాకుండా బాధ్యతను కూడా పెంచుతాయని సినీ నటి డాక్టర్ శ్రీజ సాదినేని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, వందే భారత్ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు భీష్మ అవార్డును అందించారు. ఆపై నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళా సేవలో కొనసాగుతుండడం వల్లనే భీష్మ అవార్డు లాంటి విశిష్ట పురస్కారం దక్కిందని తెలిపారు.
బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసి 29 సంవత్సరాల తన ప్రస్థానంలో నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, లైటింగ్, మేకప్, సెట్ డిజైనింగ్ ఆర్టిస్ట్ గా, ఈవెంట్ మేనేజర్ గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్ నిర్వాహకురాలిగా, యాక్టింగ్ ఫ్యాకల్టీగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, షార్ట్ ఫిల్మ్ దర్శక, నిర్మాతగా, యూ ట్యూబర్‌గా అనేక రంగాల్లో తనవంతుగా కళా సేవ చేస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఇప్పటివరకు నంది, గరుడ, అశ్వం, హనుమ వంటి వాటితో కలిపి మూడు వేలకు పైగా అవార్డులు అందుకున్నానని వివరించారు. వందేభారత్ సామాజికి సేవా సంస్థ అందించిన భీష్మ అవార్డు తన బాధ్యతను మరింత పెంచుతుందని వెల్లడించారు. తన చివరి క్షణం వరకు కళా రంగానికి సేవ చేస్తూనే ఉంటానని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు రమేష్, డాక్టర్ సాజిదా ఖాన్ కు శ్రీజ కృతజ్ఞతలు తెలిపారు.