- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్సులో సీటు కోసం రక్తాలు వచ్చేలా ఫైటింగ్.. తిరుపతి నుంచి వస్తుండగా ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులో సీటు కోసం ఆడవాళ్లు కొట్టుకుంటున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. ఇక తమ భార్యల సీట్ల కోసం భర్తలు ఫైటింగులు చేస్తున్న వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఇలాంటి సీనే మహబూబాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో రిపీట్ అయింది. గూడురు మండలం గుండెంగ గ్రామానికి చెందిన కొందరు భక్తులు తిరుపతిలో దైవదర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మహబూబాబాద్ బస్ స్టాండ్ వద్ద వారి కుటుంబానికి చెందిన మహిళలు ఓ బస్ లో సీటు కోసం టవల్ వేశారు. అయితే వారు టవల్ వేసిన సీట్ లో ఇతర పురుషులు వచ్చి కూర్చోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తమపై పిడిగుద్దులతో దాడి చేశారని తిరుపతి నుంచి వస్తున్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కు నుంచి రక్తం వచ్చేలా కొట్టారని ఆవేదన చెందారు.