- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRAOU:అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఫీజు రీఫండ్
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు అడ్మిషన్ సమయంలో అదనపు ఫీజు చెల్లించిన విద్యార్థులకు తిరిగి ఫీజు రీఫండ్ చేయనున్నట్లు ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ సమయంలో వివిధ సాంకేతిక కారణాలతో రెండుసార్లు ఫీజు చెల్లించిన వారికి ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎక్కువ ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో తమ బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను నవంబర్ 10వ తేదీలోపు విశ్వవిద్యాలయం పోర్టల్ www.braouonline.in లేదా www.braou.ac.in లో నమోదు చేసుకుని ఆధారాలను అప్‌లోడ్ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరంలో ఎంబీఏలో అడ్మిషన్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు చెల్లించిన ఫీజును కూడా రీఫండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. వారు కూడా తమ బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని సూచించారు.