ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

by Rajesh |
ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడి పరస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం నగరం చర్చ్ కాంపౌండ్‌ ఫ్లై ఓవర్ బ్రిడ్జి‌పై ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. బైక్ అదుపుతప్పి డివైడర్‌కు తగలడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.

మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో కొంతమంది వారి సెల్ ఫోన్లలో ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. మద్యం మత్తుకు యువత బానిసవ్వడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లో మార్పుకోసం పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story