రోడ్డు బాగు చేయాలని నిరసన

by Naveena |
రోడ్డు బాగు చేయాలని నిరసన
X

దిశ, అలంపూర్ టౌన్ :అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో రోడ్డు వేయాలని కాలనీ వాసులు సిపిఎం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని న్యూప్లాట్స్ చివరి వీధిలో రోడ్డు అధ్వానంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు గుంతలుగా ఏర్పడడంతో.. మహిళలు వృద్ధులు కింద పడుతున్నారని వెంటనే రోడ్డు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లోకేష్, స్వాములు, రజియాబి నజీర్ అహ్మద్ రహీం, రామాంజనేయులు సిపిఎం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story