తొందరలోనే రాకేష్ రుణం తీర్చుకుంటా: సాయి రాజేష్

by Hamsa |
తొందరలోనే రాకేష్ రుణం తీర్చుకుంటా: సాయి రాజేష్
X

దిశ, సినిమా: జమర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్(Rocking Rakesh) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (Kesava Chandra Ramawat)(కేసీఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు లాంచ్ చేశారు. ఇందులో డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh)మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. హృదయ కాలేయం ఆడియో ఫంక్షన్‌కి రాకేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేసి వెళ్ళాడు. ఆ కృతజ్ఞత నాకు అలా ఉండిపోయింది. కొన్ని రోజులుగా ముంబైలో ఉన్నప్పటికీ రాకేష్ కోసం ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన రాకేష్‌కి ఈ వేదిక పైన థాంక్స్ చెప్తున్నాను. తనకి కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. తొందరలోనే ఆ క్యారెక్టర్ రాసి రుణం తీర్చుకుంటాను. సినిమా తీసి చూస్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమాతో రాకేష్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అంజి మంచి దర్శకుడు, కెమెరామెన్. అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. కేసీఆర్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

అనంతరం అనసూయ మాట్లాడుతూ.. ‘‘మీడియాకి థాంక్యూ. రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్ గా అనిపించింది. అంజి గారు చాలా బ్రిలియంట్ గా ఈ కథని తీశారు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా హానెస్ట్ గా ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆడియన్స్ కూడా అంతే హానెస్ట్ గా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్’’ అన్నారు.

Advertisement

Next Story