వారం వ్యవధిలో 70 విమానాలకు బాంబు బెదిరింపు

by M.Rajitha |
వారం వ్యవధిలో 70 విమానాలకు బాంబు బెదిరింపు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశీయ విమాన సంస్థలకు బాంబు బెదిరింపులు ప్రస్తుతం తలనొప్పిగా మారాయి. ఈ వారంలో ఇప్పటి వరకు దాదాపు 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. కాగా శనివారం ఒక్కరోజే 30 విమానాలకు ఇలాంటి బెదరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే వీటిలో దాదాపు అన్ని ఫేక్ బెదిరింపులు ఉండటమే కాస్త ఊరటనిచ్చే విషయం. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ సంస్థలకు ఈ బెదిరింపు సందేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపుల వలన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఘటనపై పౌర విమానయానశాఖ స్పందించింది. ఇలాంటి నకిలీ బెదిరింపులను నివారించడానికి కఠిన నిబంధనలను పాటించాలని, నేరస్థులను ముందుగానే నో-ఫ్లై జాబితాలో ఉంచాలని సూచించింది.

Advertisement

Next Story