- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి : హరీష్ రావు
by Aamani |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల పై ఆరా తీశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్స్ కి అలాట్మెంట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనుజ, డీఎం ప్రవీణ్, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story