- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తప్పు చేయలేదు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’.. సల్మాన్ తండ్రి సెన్సేషనల్ కామెంట్స్
దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చంపేస్తామనే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్‌ని బిష్ణోయ్ ప్రధానంగా టార్గెట్ చేయడం వెనుక కృష్ణ జింక అనే మాట వినబడుతుంది. సల్మాన్ ఖాన్ మిత్రుడు బాబా సిద్దిఖీని హత్య చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. తర్వాత లిస్ట్‌లో ఉంది సల్మాన్ ఖాన్ అని ప్రకటించడంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్ భారీ భద్రతను పెంచారు. కృష్ణ జింక పై ఉన్న ఆరోపణల నేపథ్యంలో సల్మాన్ క్షమాపణలు చెప్పాలని కూడా బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్ డిమాండ్ చేస్తుంది.
ఈ విషయంపై తాజాగా సల్మాన్ తండ్రి సలీం ఖాన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సల్మాన్ నాతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదని అన్నారు. మూగజీవాలను వేటాడటం తనకు ఇష్టం ఉండదు. జంతువులని ఎంతగానో ప్రేమిస్తాడని చెప్పారు. ‘‘తన కొడుకు కృష్ణజింకలను ఎప్పుడూ చంపలేదని సలీమ్ ఖాన్ తెలిపారు. కృష్ణ జింకలను కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకలను చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. క్షమాపణలు చెబితే తప్పు చేసినట్టు అంగీకరించినట్టే కదా అని అన్నారు. ఈ క్రమంలో తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’’ అని సలీం ఖాన్ స్పష్టం చేశారు.