గెలిచిన రైతులు..! మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-20 06:55:10.0  )
గెలిచిన రైతులు..! మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం
X

దిశ,జగిత్యాల టౌన్: జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. గత వారం రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

పాత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకిస్తూ నిరసనలు అందోళన‌లు చేశారు. డిసెంబర్ 15న మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు తీర్మానం చేయగా నేడు రద్దు తీర్మానం చేశారు. గత మూడు రోజులుగా రైతుల నిరసనలతో మంత్రి కొప్పుల మాస్టర్ ప్లాన్ సవరిస్తున్నామని చెప్పడం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్‌లో రద్దు తీర్మానం చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.

Also Read...

తెలంగాణ డీజీపీ క్యాడర్‌పై విచారణ వాయిదా!

ప్యాకేజీ 21, 22 నిర్మించవద్దని మళ్లీ రైతుల నిరసనలు

Advertisement

Next Story