Vikarabad: కలెక్టర్‌పై దాడి కేసులో రైతులకు రిమాండ్

by Gantepaka Srikanth |
Vikarabad: కలెక్టర్‌పై దాడి కేసులో రైతులకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ కలెక్టర్‌(Vikarabad Collector)పై దాడి కేసులో రైతుల(Farmers)కు రిమాండ్ విధించారు. మంగళవారం మొత్తం 55 మంది రైతులను పరిగి పోలీసులు(Parigi Police) సుదీర్ఘంగా విచారించారు. అనంతరం 39 మంది రైతులను విడుదల చేశారు. 16 మందిని మరింత లోతుగా విచారించి వైద్య పరీక్షలకు పంపించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ 16 మంది రైతులను రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఈ దాడి ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ(Police Department) సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారితో పాటు.. గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్‌ది బీఆర్ఎస్(BRS) పార్టీగా గుర్తించారు. అతనిది హైదరాబాద్‌లోని మణికొండ కాగా, ప్లాన్ ప్రకారమే లగచర్లకు వచ్చి గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Next Story