కేసీఆర్‌పై అసత్య ప్రచారం.. బంజారాహిల్స్ పీఎస్‌లో బీఆర్ఎస్ నేత ఫిర్యాదు

by Ramesh N |
కేసీఆర్‌పై అసత్య ప్రచారం.. బంజారాహిల్స్ పీఎస్‌లో బీఆర్ఎస్ నేత ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుష్ప్రచారం ప్రసారం చేశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ చానల్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా పలు మీడియా చానళ్ళు అసత్య ప్రచారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బాల్క సమన్‌ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల లిక్కర్ స్కాంకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా దాదాపు 16 చానల్స్ కథనాలను ప్రసారం చేశాయని అన్నారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని వార్త కథనాలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed