TS: గ్రూప్-4 అప్లికేషన్ల గడువు పొడిగింపు

by GSrikanth |   ( Updated:2023-01-30 13:58:39.0  )
TS: గ్రూప్-4 అప్లికేషన్ల గడువు పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-4 ఉద్యోగాల కోసం దరఖాస్తుల గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియనుండగా చివరిరోజు భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో అప్లికేషన్ ప్రాసెస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీఎస్పీఎస్సీ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3 సాయంత్రం 5 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో గ్రూప్-4 నోటిఫికేషన్ వెలువరించింది. ఇప్పటి వరకు 8.47 లక్షల మందికి పైగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగా నిన్న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

Advertisement

Next Story