అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

by Mahesh |   ( Updated:2024-08-31 17:26:56.0  )
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా సెప్టెంబర్ 30వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. లేదా విశ్వవిద్యాలయం హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222 /333/444/555, టోల్‌ఫ్రీ నంబర్ 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాలకు www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని సూచనలు చేశారు.

Advertisement

Next Story