ఏది నిజం? ఏది అబద్ధం..? రుణమాఫీ పై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం

by Mahesh |   ( Updated:2024-08-28 09:43:54.0  )
ఏది నిజం? ఏది అబద్ధం..? రుణమాఫీ పై మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. మొత్తం మూడు విడతల్లో రూ 2 లక్షలకు రైతలపై ఉన్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేసిందని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. రుణమాఫీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రుణమాఫీ పూర్తి అయిందిని అని ఒకరు అంటుంటే.. ఆగస్టు 15 మాట నిలబెట్టుకున్నాం అని మరో నేత అంటున్నాడు.

రుణమాఫీ లో భాగంగా 7,500 కోట్లు మాత్రమే విడుదల అయింది అని ఆర్థిక మంత్రి చెబుతుంటే.. 17 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు. మరోపక్క 31 వేల కోట్లు చేసాం అని ముఖ్యమంత్రి అంటున్నారు. తాజాగా ఇంకా రుణమాఫీ ఐపోలేదని.. మధ్యలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడని.. రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటం ఆండుతుందని.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగు పడదని.. జూటా కాంగ్రెస్-జూటా హామీ అంటూ కేటీఆర్ తన ట్వీట్ రాసుకొచ్చారు.

Advertisement

Next Story