- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలిమినేటి సందీప్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో సోమవారం ఫోన్‌లో పరామర్శించారు. భువనగిరి జెడ్పీ సమావేశంలో జరిగిన గొడవపై ఆరా తీశారు. మంత్రి కోమటిరెడ్డి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జెడ్పీ చైర్మన్‌పై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందని మండిపడ్డారు. పార్టీ అంతా సందీప్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉన్న కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరికి ఇబ్బంది ఎదురైనా 60 లక్షల మంది కార్యకర్తల బలగం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గ పూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు అయ్యేదాకా కొట్లాడుదామన్నారు.