- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తొంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫార్ముల రేసింగ్ (Formula racing)లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రంగంలోకి ఈడీ అధికారులు(ED officials) దిగారు. ఈ రేసింగ్ కోసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే.. రూ. 55 కోట్లను అప్పటి మంత్రి కేటీఆర్(This car is racing) ఓ విదేశీ సంస్థలకు బదిలీ చేయించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ (KTR) పై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్(Governor)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇదే విషయంపై గవర్నర్ న్యాయ సలహా(Legal advice) కోరినట్లు సమాచారం అందుతోంది. ఈ ఫార్ములా రేసింగ్(Formula racing) అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ఎసీబీకి ఎమ్ఎయూడీ లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరగా.. ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం అందక పోయినప్పటికి, మీడియా, రాజకీయ వర్గాల్లో కేటీఆర్ అరెస్ట్(KTR arrested) ఖాయం అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.