- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR లాంటి అబద్దాల పాలన ప్రపంచంలోనే ఎక్కడ లేదు: ఆకునూరి మురళి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవని ఎక్సైజ్ శాఖ చెప్పిన సమాధానం అతి పెద్ద జోక్ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఇంత అబద్దాల పరిపాలన ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో బెల్ట్ షాపుల లెక్కల వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా యూత్ ఫర్ యాంటీ కరెప్షన్ కోరగా తెలంగాణలో బెల్ట్ షాపులు లేవని అబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది.
దీనిపై స్పందించిన ఆకునూరి మురళి.. అసలు రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేని గ్రామం, బస్తీ అంటూ లేదని దుయ్యబట్టారు. ఎక్సైజ్ శాఖ మంత్రి గారు సరైన సమాచారం చెప్పాలని.. లేకుంటే మీ శాఖ నవ్వుల పాలు అవుతుందని సెటైర్ వేశారు. జిల్లాల్లో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులేనని రాష్ట్రంలో 50 వేల బెల్టు షాపులు ఉంటే ఒక్కటి కూడా లేదని అబద్ధం చెప్పడం ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూస్తుంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.