- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, శేరిలింగంపల్లి : ఆంధ్రరాష్ట్ర ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్ధంతి సభ బుధవారం హైటెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల అభివృద్ధికి రోశయ్య ఎంతగానో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆర్యవైశ్యుల ఎన్నో ఏళ్ల కల ఆర్యవైశ్య కార్పొరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సీఎం గుర్తు చేశారు. రామ్ మోహన్ రావు, గంజి రాజమౌళి గుప్త, రామారావుకు రోశయ్య అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్త, రామ్ మోహన్ రావు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ అధ్యక్షుడు కట్ట రవి గుప్త, పాండు గుప్త, భువనగిరి శ్రీనివాస్, బిజ్జల నవీన్, ఆర్య వైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.