- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kaushik Reddy:ప్రాణం పోయినా సరే దళిత బిడ్డలకు అండగా ఉంటా:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌లో దళితబంధు(dalita bandu) డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) నేడు(శనివారం) పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్(BRS) నేతలతో ధర్నా(protest)కు దిగారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని ధర్నా చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన తర్వాత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు నిధులు విడుదల చేసే వరకు ఊరుకునేది లేదని.. తన మీద ఎన్ని కేసులు పెట్టినా, ప్రాణం పోయినా సరే దళిత బిడ్డలకు అండగా ఉంటానన్నారు. దళిత బంధు ఇవ్వకుంటే ఇంత కంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అయితే.. ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా పోలీసులు ఆయనను బలవంతంగా కారులోకి కుక్కడంతో.. ఊపిరి ఆడకపోవడం తో ఆయన కారులో.. విలవిలలాడి నట్లు ఓ వీడియోలో కనిపించింది. కాగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన స్పృహ కోల్పోవడం తో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.