BJP తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?

by Gantepaka Srikanth |
BJP తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ స్టేట్ చీఫ్‌గా సీనియర్, సమర్థత ఉన్న నేతలకు బాధ్యతలను అప్పజెప్పే అవకాశమున్నది. ప్రస్తుతం పార్టీ స్టేట్ చీఫ్‌గా కిషన్‌‌రెడ్డి ఉన్నందున ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవడంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వొచ్చన్న మాటలూ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఈటల రాజేందర్‌ను స్టేట్ పార్టీ చీఫ్‌గా ప్రకటించే అవకాశమున్నదని సమాచారం. మిగిలిన ఎంపీల్లో డీకే అరుణ (గతంలో రాష్ట్ర మంత్రి), ధర్మపురి అరవింద్ (సెకండ్ టైమ్ ఎంపీ), గోడం నగేశ్ (రాష్ట్ర మాజీ మంత్రి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (సెకండ్ టైమ్ ఎంఫీ) తదితరులకు ఎలాంటి బాధ్యతలు, పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగ మారింది. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా అవకాశాన్ని దక్కించుకుంటున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర పార్టీ చీఫ్‌ బాధ్యతలు నిర్వర్తించినవారే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed