BJP స్టేట్ చీఫ్ పోస్ట్‌పై మరోసారి ఈటల కీలక వ్యాఖ్యలు

by Rajesh |
BJP స్టేట్ చీఫ్ పోస్ట్‌పై మరోసారి ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్‌పై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని తెలిపారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో తాను కొట్లాడానన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే.. దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదన్నారు. నా లాంటి వాళ్లు ఊరికే మాట్లాడరని.. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మలతో కొట్లాడమని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతానన్నారు. అయితే ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బీజేపీ స్టేట్ చీఫ్‌గా దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేవాళ్లు కావాలని అందరినీ కలుపుకుని పోయే వాళ్లయితేనే బెటర్ అని హైకమాండ్‌కు సూచించారు. అయితే ఈటల, రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story