- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ప్రజా పాలన కాదు.. నిర్బంధ పాలన: కాంగ్రెస్ సర్కార్‌పై ఎర్రోళ్ల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇది ప్రజా పాలన కాదు.. నిర్బంధ పాలన అని, పోలీసులు రాత్రి నుండే అమ్మాయిలని కూడా చూడకుండా అరెస్టు చేశారని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి అందుబాటులో వారితో చర్చలు జరపకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక ఆశలు కల్పించి ఎన్నికల్లో వారిని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రొడ్డుకీడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టబోమన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేసి, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి న్యాయపరమైన డిమాండ్లను, హామీలను నెరవేర్చాలని కోరారు.