ఢిల్లీకి చేరిన MLC జీవన్ రెడ్డి ఎపిసోడ్

by Rajesh |
ఢిల్లీకి చేరిన MLC జీవన్ రెడ్డి ఎపిసోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హస్తం పార్టీలో అగ్గి రాజేసింది. సంజయ్ చేరికతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. కాగా, తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. ఈ రోజు ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు, ప్రధానంగా జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed