Best Winter Teas: చలికాలం వచ్చేస్తోంది.. ఉదయాన్నే ఈ స్పెషల్ టీలు అలవాటు చేసుకోండి.. !!

by Anjali |   ( Updated:2024-10-26 15:40:12.0  )
Best Winter Teas: చలికాలం వచ్చేస్తోంది.. ఉదయాన్నే ఈ స్పెషల్ టీలు అలవాటు చేసుకోండి.. !!
X

దిశ, వెబ్‌డెస్క్: చలికాలం(winter) వస్తుందంటే చాలు జనాలు చలితో వణికిపోతారు. పైగా దీనికి తోడు కాలాలతో సంబంధం లేకుండా వర్షాలు(rains) కూడా పడుతున్నాయి. సాధారణ రోజుల కన్నా శీతాకాలంలో గాలిలోని తేమ అధికంగా ఉంటుంది. దీంతో క్రిముల(germs) సంఖ్య పెరుగుతుంది. రోగాలు వస్తాయి. కాగా మన బాడీకి ఇమ్మూనిటి పవర్(Immunity power) ను పెంపొందించుకోవాలంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పెషల్ టీ తాగాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తులసి ఆకులతో టీ..

తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తులసి టీ(Basil tea) తాగితే శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో మేలు చేస్తుంది. కాగా ఒక గ్లాస్ వాటర్ లో కొన్ని తులసి ఆకులను మరిగించండి. అందులో పావు చెంచా మిరియాలపొడి మిక్స్ చేసి.. వడపోసి తేనెతో కలిపి తాగితే చలికాలం వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

ఉసిరి టీ..

ఒక గ్లాస్ మరిగించిన వాటర్ లో ఒక చెంచా జీలకర్ర(cumin), మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు(Mint leaves), కొంచెం అల్లం, వేసి వడకట్టి తాగితే ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది. ఈ ఉసిరి రసాన్ని తేనె(Amla juice)తో మిక్స్ చేసి పరగడుపున మార్నింగే తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు.

అల్లం విత్ పసుపు టీ

భోజనం తర్వాత ప్రతి రోజూ అల్లం విత్ పసుపు టీ(Turmeric tea with ginger) తాగితే అనేక ప్రయోజనాలున్నాయి. కాగా ఒక గ్లాస్ వాటర్ లో కొంచెం తురిమిన అల్లం, పసుపు వేసి మరిగించుకోండి. దీన్ని వడగట్టాక కొన్ని చుక్కల నిమ్మరసం(lemon juice), తేనె వేసి కలిపి ఫుడ్ తిన్నాక తాగితే జీర్ణక్రియ(digestion) మెరుగుపడుతుంది.

దాల్చిన చెక్కతో టీ..

సాధారణంగా మెటబాలిజం(Metabolism) బాడీ ఇమ్యూనిటి పవర్(Immunity) ను పెంచుతుంది. కాగా దాల్చిన చెక్కను వాటర్ లో మరిగించి.. వడపోసి తాగితే శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని అందిస్తుంది.కాగా ప్రతి రోజూ దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగండి రోగాలకు చెక్ పెట్టండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story