Municipal Office : మున్సిపల్ కార్యాలయం ముందు వార్డ్ అధికారుల ధర్నా..

by Sumithra |   ( Updated:2024-10-26 08:22:56.0  )
Municipal Office : మున్సిపల్ కార్యాలయం ముందు వార్డ్ అధికారుల ధర్నా..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : వనపర్తి ( Vanaparthi ) జిల్లా కొత్తకోట మున్సిపల్ వార్డ్ అధికారి మామిళ్ల జయరాములు పై మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పొగాకు విశ్వేశ్వర్ దాడి చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు వార్డు అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ ( Municipal Chair Person ) భర్త విశ్వేశ్వర్ కు సంబంధించిన వివాదాస్పదమైన ఫైల్ పై సంతకం పెట్టమని ఒత్తిడి చేయడంతో జయరాం తిరస్కరించాడని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైల్ పై సంతకం పెట్టనని తెలపడంతో వార్డు ఆఫీసర్ పై దుర్భాషలాడుతూ దాడి చేయడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొగాకు విశ్వేశ్వర్ అహంకారపూరితంగా మున్సిపల్ మేనేజర్ సమక్షంలోనే జయరాములు పై దాడి చేయడం పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పొగాకు విశ్వేశ్వర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు ( criminal case )నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కఠినమైన రక్షణ చట్టం తీసుకురావాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు సాయి, కిషోర్, బాలాజీ, మధు, శరత్ కుమార్, రాజు, మమత, చందన, రాజేశ్వరి, లీలా, సమత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story