- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu: మళ్లీ మళ్లీ చెబుతున్నా.. 1995 నాటి చంద్రబాబును నేను: ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తాను 1995 నాటి చంద్రబాబునని ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరి (Mangalarigiri)లో టీడీపీ (TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivas Rao) చేతుల మీదుగా తొలి సభ్యత్వం అందుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఘటన కార్యకర్తలకే దక్కుతుందని అన్నారు. మొన్న జరిగింది ఎన్నికలు కావని.. రాక్షసుడితో యుద్ధం అని చంద్రబాబు కామెంట్ చేశారు. గడిచిన ఐదేళ్ల పడిన కష్టాలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని అన్నారు. గ్రామం నుంచి రాష్ట్రం వరకు పార్టీకి పటిష్టమైన యంత్రాంగం ఉందని తెలిపారు. పార్టీలో మెరిట్ ఉన్న వాళ్లకే పదువులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్ధాల్లో ఎన్నో సంక్షోభాలు దాటామని గుర్తు చేశారు. మనల్ని ఖతం చేద్దామనుకున్న వాళ్లే ఖతం అయ్యారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నామని కక్షలు తీర్చుకోనని.. కానీ తప్పులు చేసిన ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు జీవితాలతో చలగాటం ఆడారని గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రజలంతా గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడుతున్నారని తెలిపారు. టీడీపీ (TDP)లో కొందరు ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని తెలిసిందని.. ఇసుక, మద్యం పాలసీల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.