- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్వాస ఆడలేదు.. బతకడం చాలా కష్టమన్నారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: సాధారణంగా ఏ పేరెంట్స్ అయిన తమకు ఏం జరిగినా తట్టుకుంటారు. కానీ, తమ పిల్లలకు ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరన్న సంగతి తెలిసిందే. ఇక పిల్లలు జబ్బు పడితే వారి మనస్సు విలవిల్లాడిపోతుంది. అలాంటిది ప్రాణాపాయంలో ఉంటే ఆ పేరెంట్స్ గుండె ఎంత తల్లిడిల్లుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తనక్కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంటూ బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాయేద్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'నా పెద్ద కొడుకు జిడాన్కు మూడేళ్ల వయసున్నప్పుడు శ్వాసకోస సమస్యతో బాధపడ్డాడు. ఓసారి లండన్‌లో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. నాన్న.. ఊపిరాడటం లేదు, సాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంతలో నా భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. 15 నిమిషాల్లో అంబులెన్స్ రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన నర్స్ ఒకరు బతకడం కష్టమన్నారు. నా సంతకం తీసుకున్నాక జిడాన్కు అడ్రినలైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే సిటీలో ఎక్కడెక్కడో ఉన్న నలుగురు డాక్టర్లను ఆస్పత్రికి పిలిపించారు.
అయితే ఆ డాక్టర్లు స్టెరాయిడ్లు పని చేయకపోతే మెడ దగ్గర కోసి సర్జరీ చేస్తామన్నారు. దేవుడి దయ వల్ల కాసేపటికే స్టెరాయిడ్స్ పని చేయడంతో సర్జరీ అవసరం లేదన్నారు. లండన్‌లోని హెల్త్ కేర్ సిస్టమ్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే' అంటూ జాయేద్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు సంజయ్ ఖాన్ తనయుడే జాయేద్ ఖాన్. ఇతడు 2005లో మలైకాను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ దంపతులకు 2008లో జిడాన్, 2011లో ఆరిజ్ అనే కుమారులు జన్మించారు.