Game Changer: ‘గేమ్ చేంజర్’ టీజర్ ఆన్ ది వే.. బ్లాస్ట్ చేద్దాం అంటూ మూవీ టీమ్ బిగ్ అప్‌డేట్

by sudharani |   ( Updated:2024-10-29 15:14:08.0  )
Game Changer: ‘గేమ్ చేంజర్’ టీజర్ ఆన్ ది వే.. బ్లాస్ట్ చేద్దాం అంటూ మూవీ టీమ్ బిగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ వెయిటెడ్ (Most Weighted) సినిమాలో.. కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్ కాగా.. అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు. అయితే.. 2024 క్రిస్మస్ కానుకగా.. ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయ్యి.. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే.. క్రిస్మస్ (Christmas) కు వస్తుంది అనుకున్న చిత్రం పోస్ట్ పోన్ (Post Pone) కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో కాస్త నిరుత్సాహం (disappointment) వచ్చింది. దీంతో.. రిలీజ్ (release) వాయిదా వేసిన మూవీ టీమ్.. వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తూ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి (Diwali) స్పెషల్‌గా ‘గేమ్ చేంజర్’ నుంచి టీజర్ (teaser) రిలీజ్ చెయ్యబోతున్నట్లు సోషల్ మీడియా (Social Media) వేదికగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు.. ‘టీజర్ ఆన్ ది వే.. ఈ దీపావళిని #GameChangerTeaserతో బ్లాస్ట్ చేద్దాం’ అని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక దీపావళి తన అభిమాన హీరో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుంచి టీజర్ వస్తుందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story