- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నా లక్ష్యం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
దిశ,కొడకండ్ల : మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. .వ్యవసాయ రంగానికి చెక్ డ్యామ్ వంటి నీటి పారుదల సదుపాయాలు రైతాంగానికి, గ్రామీణ అభివృద్ధికి కీలక మనీ ,చెక్ డ్యామ్ నిర్మాణం జరిగితే గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ పెరుగుతాయని, రైతులకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ చెక్ డ్యాం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే యశస్విని అన్నారు.
అనంతరం కొడకండ్ల మండల కేంద్రం లో స్ట్రీట్ లైట్ లను ప్రారంభించారు.అనంతరం రైతులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నా లక్ష్యమని,నియోజకవర్గం లో ఉన్న గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రంగయ్య, నియోజకవర్గ యువజన అధ్యక్షులు రాజేష్ నాయక్ , సోమ నరసయ్య, రమేష్, రాజేష్, యాకేష్, శీను, గ్రామస్థులు మరియు రైతులు పాల్గొన్నారు.