- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన మల్లన్న జాతర ఉత్సవాలు
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి మల్లికార్జున స్వామి (మల్లన్న) కళ్యాణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు చక్కెర తీర్థం, జాతర జనాలతో కిక్కిరిసిపోయింది. వీడిసి అధ్యక్షుడు గూడెల్లి గంగారం మాట్లాడుతూ..దేవునిపల్లి మల్లన్న కళ్యాణోత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతర ఆదాయం లెక్కింపు బుధవారం రోజు చేయడం జరిగిందని తెలిపారు. అగ్నిగుండాలు, ఒడి బియ్యం, కళ్యాణ కట్నాలు, హుండీ, వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయం రూ.80,682/- సమకూరిందన్నారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 3,000 మంది భక్తులకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు బీజేపి సీనియర్ రాష్ట్ర నాయకులు డా.పైడి ఎల్లారెడ్డి, కుంటా లక్ష్మారెడ్డి, బండారి నరేందర్ రెడ్డి, విపుల్ జైన్, మనోహర్ రెడ్డి, రాజు పాటిల్, నంది వేణు, కాసర్ల రవీందర్, దోమకొండ ఎస్సై ఆంజనేయులు, కౌన్సిలర్ పోలీసు కృష్ఞాజీ రావులు దర్శించుకున్నారు. కాకతీయుల కాలం నుండి ఆలయంలో నిరంతరాయంగా మల్లికార్జున స్వామి పూజలందుకోవడం గొప్ప విషయమని వారు కొనియాడారు. చివరగా మల్లికార్జున స్వామి మేడాలమ్మ, గొల్ల కేతమ్మల నాగవెల్లి కార్యక్రమాన్ని ఒగ్గు కళాకారులు పట్నాలు వేసి మల్లన్న కళ్యాణోత్సవాలను ముగింపు చేశారు. ఈ కార్యక్రమంలో వీడిసి ఉపాధ్యక్షులు వంగ రాహుల్, నిట్టు లింగారావు, ప్రధాన కార్యదర్శి ద్యావరి నవీన్, కోశాధికారి నాగల్ల స్వామి దోని, విడిసి కార్యవర్గం మీసాల నవీన్, చాకలి రమేష్, బోడోల్ల రాజేందర్, పెద్దోళ్ల శశిధర్ రావు, మీసాల శ్రీను, మోత్కూరు నరేష్, గొల్ల సాయిరాం యాదవ్, అవుసుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.