- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన ఎమర్జెన్సీ మీటింగ్.. ఆ పరీక్షను రద్దు చేసే యోచనలో కమిషన్..?
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. రెండు మూడు పరీక్షలకు సంబంధించిన పరీక్ష పేపర్ల లీక్ అవ్వడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్రమత్తమైంది. వరుస పేపర్ లీక్ ఘటనలపై చర్చించేందుకు ఇవాళ కమిషన్ అత్యవసర భేటీ అయ్యింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహం 3 గంటలకు అధికారులు భేటీ అయ్యారు. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ లీక్‌పై అధికారులు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆ పేపర్ లీక్ అయినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఏఈ పరీక్షను రద్దు చేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు వస్తున్న అనుమానాలపైన ఆధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సీఎస్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇవ్వనుంది. ఇక, ఈ నెల 13వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ రెండు రోజుల ముందే లీక్ అయినట్లు గుర్తించిన టీఎస్పీఎస్సీ ఆ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్‌కు పాల్పడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి ప్రవీణ్, రాజశేఖర్‌లతో పాటు మరో తొమ్మది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.