ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ సర్కార్ కీలక సర్వే.. ఈ అంశాలే టాస్క్

by Nagaya |   ( Updated:2023-01-03 02:17:35.0  )
ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ సర్కార్ కీలక సర్వే.. ఈ అంశాలే టాస్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీ ఇంటికి భగీరథ నీరొస్తున్నదా? మరుగుదొడ్లు ఉన్నాయా? స్కూల్​ఉన్నదా? అంగన్​వాడీ కేంద్రాలున్నాయా? వాటిలో సరైన సౌకర్యాలు ఉన్నాయా? వంటి అంశాలపై గిరిజన సంక్షేమ శాఖ అతి త్వరలో సర్వే చేయనున్నది. ఆదివాసీ, గిరిజన ఏరియాల్లో సుమారు 13 రకాల అభివృద్ధి కార్యక్రమాలు, స్కీమ్‌లు గురించి సర్వే చేయనున్నది. ట్రైబల్ ఏరియాల్లోని గ్రామాలతో పాటు గిరిజన స్కూళ్లు, హాస్టళ్లలో కూడా ఆఫీసర్లు అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,718 ఆవాసాల్లో సర్వే జరగనున్నది. ప్రతీ జిల్లాకో టీమ్​సర్వే నిర్వహించనున్నది. స్టడీ అనంతరం ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించనున్నారు. వాటిలో గుర్తించిన అంశాలను బేస్​చేసుకొని డెవలప్​మెంట్ కార్యక్రమాలను స్పీడ్‌గా చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఎన్నికల నాటికి ఈ టాస్క్​ను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోన్నదని సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బాధ్యతలను గిరిజన శాఖ మంత్రితో పాటు మరో ఇద్దరు కీలక మంత్రులు మానిటరింగ్ చేయనున్నారు.

సర్కార్‌కు 'ఫీవర్'

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వానికి టెన్షన్​స్టార్ట్​అయింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతామనే భయాందోళనలో ఉన్నది. దీంతో ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా తండాలను గ్రామ పంచాయతీలు చేశామని గొప్పగా ప్రకటించుకున్న సర్కార్... అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో ఫెయిలైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు స్థానిక ఎమ్మెల్యేల సహాయంతో ప్రభుత్వాన్ని రిక్వెస్టులు పెట్టారు. కానీ ఎనిమిదేళ్లుగా సర్కార్​ గిరిజన ప్రాంతాలపై వివక్ష చూపుతూనే ఉన్నది. దీంతో సర్కార్‌పై మెజార్టీ గిరిజనులు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని గ్రహించిన ప్రభుత్వం ఎన్నికల నాటికి ట్రైబల్ ఏరియాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ షురూ చేయాలని ప్రణాళికను సిద్ధం చేయడం గమనార్హం.

ప్రస్తుతం ఇలా...

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన, ఆదివాసీ గ్రామాలలో త్రీ ఫేజ్​కరెంట్, ఇంటర్నెట్ సదుపాయం, ఇంటింటికీ భగీరథ వాటర్, డబుల్ బెడ్​రూమ్​ఇళ్లు, స్కూళ్లు, అంగన్​వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చింది. ఇప్పటికీ 50 శాతం ఆదివాసీ ఆవాసాల్లో ఈ సౌకర్యం లేదు. ఇక వ్యవసాయానికి సంబంధించిన చేయుతను కూడా ఇవ్వడం లేదని గిరిజన రైతులు విమర్శిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్కూళ్లు, అంగన్​వాడీ కేంద్రాలున్నా... కనీస మౌలిక సదుపాయాలు లేవు. దీంతో ఎంతో మంది గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గిరిజన యువతకు ఉపాధి స్కీమ్​లు కూడా అటకెక్కినది. ఎంతో మంది ట్రైకార్‌లో లోన్లు, ఇతర స్కీమ్‌ల కొరకు అప్లై చేసినా అప్రూవల్స్​కావడం లేదు. 2017 నుంచి చాలా మంది అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులే వాపోతున్నారు. బడ్జెట్​లేనిది తామేమీ చేయలేమని చెప్పుకొస్తున్నారు.

Also Read..

'కారు' గెలుపు కోసం కంటి వెలుగు..!

Advertisement

Next Story

Most Viewed